AP: విశాఖలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనులు జరుగుతుండగా విద్యుత్ పోల్ పక్కకు ఒరిగింది. రైల్వే OHE విద్యుత్ వైర్లపై స్తంభం పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, అదే సమయంలో అటుగా వెళ్లిన టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకోపైలెట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.