KDP: బ్రహ్మంగారి మఠంలోని అన్నప్రసాదాలశాలను సోమవారం నూతన పీఠాధిపతి వెంకటాద్రి స్వామి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహారం, రుచి నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం అన్నప్రసాదాల విరాళాల రసీదులను కూడా తనిఖీ చేశారు. అన్న ప్రసాదాల పరిసరాల పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.