JDU చీఫ్, బీహార్ ఆపద్ధర్మ CM నితీష్ ఆ పార్టీ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన JDU MLAలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అటు BJP శాసన సభాపక్షనేతగా సామ్రాట్ చౌదరి, ఆయనకు డిప్యూటీగా విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. కాగా, రేపు నితీష్ బీహార్ CMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.