అనంతపురం KSN మహిళా కళాశాల పీడీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు, విద్యార్థి సంఘం నేతలు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. పీడీపై విచారణ వేగవంతం చేయాలని YCP విద్యార్థి విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు.