AP: భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రమని ప్రధాని మోదీ కొనియాడారు. భక్తి, జ్ఞానం, కర్మ.. ఈ మూడూ సేవతోనే ముడిపడి ఉంటాయని, సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు.. సేవించు.. ఇదే బాబా నినాదమన్నారు. బాబా బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుందన్నారు. కోట్లమంది బాబా భక్తులు మానవసేవ చేస్తున్నారని చెప్పారు.