టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ(140* ) తమిళనాడుపై వరుసగా రెండో సెంచరీ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 9వ సెంచరీ. కాగా అంతకుముందు ఆంధ్రా జట్టుపై ఆడిన మ్యాచులోనూ రింకూ అజేయంగా 165 రన్స్(13 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన సంగతి తెలిసిందే.