NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెరలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్, ఏహెచ్టీయూ బృందం సైబర్ క్రైమ్ గురించి బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణించే మహిళలు విధిగా ‘టీ సేఫ్’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు.