మహబూబ్ నగర్ జిల్లా నగరపాలక పరిధిలో ఈనెల19 నుంచి 21 వరకు తాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఊటుకుంట రైల్వే ట్రాక్ సమీపంలో పైప్లైన్ లీకేజీ కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మళ్ళీ 22వ తేదీన తిరిగి సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.