కాకరకాయ జ్యూస్లో విటమిన్లు(A,C), పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు బరువు తగ్గుతారు. జీర్ణక్రియ, కంటి చూపు మెరుగుపడుతుంది.