ASF: కౌటాల KGBVలో కాంట్రాక్టు పద్దతిలో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO హన్మంతు ప్రకటనలో తెలిపారు. హెడ్ కుక్ SSC, అసిస్టెంట్ కుక్ 7వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మండలానికి చెందిన మహిళలు అర్హులన్నారు. ఈనెల 21లోగా MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.