NLG: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షుడిగా రావులపాటి రవిశంకర్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ ఆయనకు మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. జిల్లాలో బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అలాగే పార్టీని బలోపేతం చేయడానికి బీఎస్పీ సిద్ధాంతాలకనుగుణంగా కృషి చేస్తానని వెల్లడించారు.