ASF: కాగజ్ నగర్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం సిద్ధం కావాలని కలెక్టర్ హరిత సోమవారం సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని, ఉపాధ్యాయులు సబ్జెక్టుల సందేహాలను పరిష్కరించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆరోగ్య రక్షణ, పరిశుభ్రత, సులభ జీర్ణమయ్యే ఆహారం అందించాలన్నారు.