కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు తెలిపింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించారు. చిన్నపిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.