గద్వాల జిల్లా రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థినులు మనీషా, మహేశ్వరిలు మరణించిన విషయం తెలిసిందే. చిరకాలం గుర్తుంచుకునేలా కొత్త నర్సింగ్ కాలేజీకి, లైబ్రరీకి లేదా హాస్టల్కు వారి పేరు పెట్టాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు.