NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంధర్ రెడ్డి అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 14 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.