AP: రాష్ట్రంలోని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ తీపికబురు చెప్పారు. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. కాగా గతంలో 48 గంటల లోపు జమ అయ్యేవి. అటు రైతుల కోసం 6.34 కోట్ల గోనె సంచులు సిద్ధం చేసి రైతు సేవాకేంద్రాల్లో ఉంచామని, ధాన్యం రవాణాకు 32 వేల లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.