WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు జారీ చేస్తూ, వడ్లు తరలించే అన్ని వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. సేకరించిన వడ్లు గోదాముల్లో లేదా కేటాయించిన మిల్లుల్లోనే ఉండాలని, వాటిని పక్కదారి పట్టించరాదని స్పష్టం చేశారు. మిల్లర్ల నుండి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ప్రైవేట్ మిల్లింగ్‌కు అనుమతి లేదని, వాటిని వెంటనే సీజ్ చేస్తామన్నారు.