KDP: యోగివేమన యూనివర్సిటీలో ఈనెల 11వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నట్లు RSF రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేశ్ యాదవ్ పేర్కొన్నారు. స్నాతకోత్సవ కార్యక్రమం యూనివర్సిటీలో కాకుండా ప్రైవేటు కల్యాణ మండపంలో జరిపించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు. అప్పటికీ అధికారులు స్పందించకపోతే 13వ తేదీన యూనివర్సిటీలో బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు.