KMM: సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద నిఘా పటిష్టంగా చేపట్టాలని, ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం జిల్లాలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పౌరసరఫరాల అధికారి, ముదిగొండ మండలం వల్లభి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.