NGKL: కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. యువతలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి ఇటువంటి వేదికలు ఎంతో దోహదపడతాయని ఆయన కొనియాడారు.