BHPL: చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో సోమవారం డాక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామస్తులకు పరీక్షలు చేసి.. ఉచిత మందులు అందజేశారు. డాక్టర్ వెంకన్న మాట్లాడుతూ.. వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరించాలి, నీడలో పనులు చేసుకోవాలి, డీహైడ్రేషన్ రాకుండా చలువ పానీయాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.