అన్నమయ్య: రాయచోటి క్యాంప్ కార్యాలయంలో సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ‘ప్రజా దర్బార్’ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వయంగా స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.