మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు, గెరిల్లా దాడుల స్పెషలిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ నుంచి మకాం మార్చేందుకు మారేడుమిల్లి సరిహద్దు మీదుగా ఆంధ్రాలోకి ప్రవేశించారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు తాజాగా ఆపరేషన్ చేపట్టాయి.