SKLM: పశు సంపద పెంచేందుకు అందరము కృషి చేయాలని మండల పశువైద్య శాఖ అధికారి రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ సంతబొమ్మాళి మండలం లక్కివలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులు పెంపకానికి, దూడల ఉత్పత్తికి ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. దీంతో పాల ఉత్పత్తి పెరిగి కుటుంబాలు స్వయం ఉపాధి వైపు పయనిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో Ex ఎంపీపీ ధర్మార్జునురెడ్డి పాల్గొన్నారు.