NDL: అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు పయనమయ్యారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం మఠంలో సోమవారం నిత్య ఆరాధనలు చేసిన తర్వాత పీఠాధిపతి శిశ్య బృందంతో కలిసి ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కిదాంబి వేణుగోపాలన్ ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా పీఠాధిపతికి వీడ్కోలు పలికారు.