HYD: భార్య గర్భంలోని కవలలు మృతి చెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.