హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాళోజి కళాక్షేత్రంలో సోమవారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నగర మేయర్ గుండు సుధారాణి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పాల్గొన్నారు.