ATP: ఉరవకొండలో ‘ఆర్డీటీని రక్షించుకుందాం – అనంతను కాపాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన FCRA రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆర్డీటీ మనుగడ అనంతపురం జిల్లా అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.