GNTR: వైసీపీ ఎస్సీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర బాపట్ల నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తెనాలి ఐతానగర్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలుపగా, ఆయన సురేంద్రను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.