BHPL: రేగొండ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ సేవలను జిల్లా మేనేజర్ రాజు నాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాలు, అత్యవసర సామాగ్రి, స్ట్రెచర్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.