TG ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో నటుడు శివాజీకి ‘దండోర’ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలోని నా నటనకు గద్దర్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా కోసం నాకన్నా దర్శకుడు మురళీకాంత్ చాలా ఎక్కువ కష్టపడ్డాడు. నా అవార్డు అతనికి ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను’ అని చెప్పుకొచ్చాడు.