NZB: బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతుల గురించి ఆరా తీశారు.