»Father Dies With Heart Attack In Function Hall After Daughter Marriage At Godavarikhani
Heart Attack కూతురి మెడలో తాళి పడగానే.. మండపంలోనే కన్నుమూసిన తండ్రి
బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఈ సమయంలో కొంత అలసటకు గురైన శంకర్ మండపంపై కుర్చీలో కూర్చున్నారు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు వచ్చి లేపి చూడగా అచేతనంగా పడి ఉన్నారు.
పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వారు జీవితంలో స్థిరపడేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు (Daughter) పెళ్లి ఘనంగా జరిపించాడు. తన బాధ్యత తీర్చుకున్నాడు. బంధుమిత్రులతో (Family and Friends) ఆనందంగా గడిపాడు. అలసిపోయి కొద్దిసేపు కుర్చీలో (Chair) కూర్చున్నాడు. ఆ కుర్చీలోనే హఠాన్మరణం పొందాడు. దీంతో పెళ్లితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో విషాదం (Tragedy) అలుముకుంది. ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలోని (Godavarikhani) విఠల్ నగర్ కు చెందిన ఎలిగేటి శంకర్ (56)కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం బుధవారం పట్టణంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో శంకర్ ఘనంగా జరిపించాడు. పెళ్లి తంతు ముగిసి భోజనాలు చేశారు. బంధుమిత్రులు ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఈ సమయంలో కొంత అలసటకు గురైన శంకర్ మండపంపై కుర్చీలో కూర్చున్నారు. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు వచ్చి లేపి చూడగా అచేతనంగా పడి ఉన్నారు. హతాశయులైన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. కుర్చీలోనే గుండెపోటుకు గురై శంకర్ హఠాన్మరణం పొందారు.
పెళ్లి పనులతో తీరిక లేకుండా గడపడంతోనే శంకర్ అలసటకు లోనయ్యారని తెలుస్తోంది. పని ఒత్తిడికి తోడు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. వీటన్నిటి కారణంగా అలా కుర్చీలోనే మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తండ్రి మరణంతో నవ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. అత్తగారింటికి వెళ్తున్న ఆనందం కన్నా తండ్రి కాలం చేశారనే బాధతో ఆమె తల్లిడిల్లిపోయింది. పెళ్లిబట్టలు ఆమె కన్నీటితో తడిసిపోయాయి.