NRPT: కృష్ణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ ఎస్సై శిరీష, చెక్ పోస్ట్ ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో సోమవారం వాహనాలను తనిఖీ చేయగా 3.465 లీటర్ల మద్యం లభించింది. ఈ మేరకు మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.