TG: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓ బాంబు పేలుస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సారా దుకాణాలు ప్రారంభించాలని కోరుతానని చెప్పారు. అప్పట్లో సారా తాగినవాళ్లు 110 ఏళ్లు బతికారని.. ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని విమర్శించారు. సైంటిఫిక్గా ఆరోగ్యానికి సారా హానికరం కాదన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇటీవల సారాదుకాణాలు ప్రారంభించాయన్నారు.