E.G: రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీ లక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ప్రమాణాలు & ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు, బెయిల్ పిటీషన్లు ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని పేర్కొన్నారు.