రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన జీవితకాలంలో ఏనాడూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్ అన్నీ తరలించుకుపోయారని.. తమకు రావాల్సిన నీళ్లు, నిధులను కూడా కోల్పోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.