SRD: జిల్లాలో చలి తీవ్రత రోజుకు తీవ్రంగా పెరుగుతుంది. కోహిర్ మండలంలో కనిష్టంగా 8.1 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఝరా సంఘం 8.8, సదాశివపేట 9.0, గుమ్మడిదల 9.4, కంగ్టి 9.5, నిజాంపేట 9.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.