ASF: షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శనివారం కాగజ్ నగర్ లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. అనంతరం ఎస్సీ విద్యార్ధుల సంక్షేమం, వసతి సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఈడీ సురేష్ కుమార్, ఇతర అధికారులతో సమీక్షించారు.