MHBD: కొత్తగూడ మండలానికి చెందినకాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్లా నారాయణ రెడ్డి మనవరాలు చల్లా దిశ అండర్-10 విభాగంలో తెలంగాణ రాష్ట్ర ఆర్చెరీ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నెల 28న జరిగే జాతీయ స్థాయి ఆర్చెరీ చాంపియన్షిప్లో తెలంగాణ తరపున పోటీపడనుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు దిశను అభినందించారు.