TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ ఎన్నిక రేవంత్‌కు జీవన్మరణ సమస్యగా మారడంతో 15 మంది మంత్రులు, డీజీపీ వరకు యంత్రాంగాన్ని మోహరించారని మండిపడ్డారు. రూ. 200 కోట్ల ఖర్చుతో, ఆడబిడ్డపై దాష్టీకం వరకు ప్రతి దశలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.