PPM: పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ వేదిక ద్వారా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.