SRCL పట్టణంలోని పద్మశాలి సంఘం భవనంలో నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ జిందం కళా, వైస్ ఛైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లను పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు వారిని సన్మానించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. పద్మశాలి సంఘ అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.