AP: వైసీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆ పార్టీనేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్ఫోర్స్లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్ కమిటీలదే కీలకపాత్ర’ అని పేర్కొన్నారు.