KRNL: ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలలను ప్రభుత్వమే కొనసాగించకపోతే దశలవారీగా ఉద్యమం చేస్తామని పీడీఎస్ఓ నాయకులు హెచ్చరించారు. శనివారం ఆదోనిలో నాయకుడు తిరుమలేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీపీపీ మెడికల్ కళాశాలల విధానానికి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి వెనక్కి తగ్గడం లేదంటే అందులో ఎంత లాభం ఉందో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో PDSO నాయకులు, తదితరులు పాల్గొన్నారు.