అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణం నుండి కే.బుడుగుంట పల్లికి వెళ్లే దారిలో రైల్వే గేట్ నుండి రైల్వే ఆర్డర్ బ్రిడ్జి వరకు నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల చుట్టుపక్కల 25 గ్రామాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జికి, రోడ్డుకు సహకరించిన నాయకులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.