పండితులు, వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం ఇంట్లో అరటి చెట్టును పెంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అరటి చెట్టుకు దేవ వృక్షం అనే పేరు ఉంది. ఈ చెట్టుకు రోజూ పూజ చేయడం వలన, నీరు పోయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా అరటి చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటితే ఆ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి. వివాహ జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.