ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే.
చాలా మందికి మందంటే ప్రాణం. వారికి మద్యం(Liquor) లేనిదే నిద్ర రాదు. ఇంకొందరు అయితే బార్ షాపుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వైన్స్(Wines) ముందు క్యూ కట్టి మందు బాటిల్ ను సొంతం చేసుకుంటే వారికి ఒక రాజ్యాన్ని జయించినంత ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటివారు ఒక్కరోజు మందు తాగకుంటే అల్లాడిపోతుంటారు. ఇటువంటి మద్యం ప్రియుల వల్ల, మద్యం వల్ల ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం అందుతోంది. తాజాగా మద్యం ప్రియులకు ఓ తీపికబురు అందింది. ఇక మందు కోసం వారు క్యూకట్టాల్సిన పనిలేదు. గంటల తరబడీ బార్ల(Bars) వద్ద ఎదురుచూడాల్సిన పనిలేదు. 24 గంటలూ తెరచి ఉండే లిక్కర్ ఏటీఎం(Liquor Atms)లు రాబోతున్నాయి.
ఒకప్పుడు నగదు కోసమే మాత్రం ఏటీఎం(ATM)కు వచ్చే ప్రజలు ఇకపై లిక్కర్ ఏటీఎంల(Liquor Atms)కు రాబోతున్నారు. బార్ ఏటీఎంలలో బీరు, బ్రాంది, విస్కీ, రమ్, జిన్ వంటి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ బార్ ఏటీఎంలు ఉండేవి తమిళనాడులోని చెన్నైలో మాత్రమే. తమిళనాడు ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం కొనుగోలు చేయొచ్చు.
ప్రస్తుతం ఈ బార్ ఏటీఎంలు(Liquor Atms) తమిళనాడులోని కోయంబేడు సమీపంలో వీఆర్మాల్, టెన్ స్క్వేర్ మాల్, రాయపేట ఎక్స్ప్రెస్ అవెన్యూ, వేళచ్చేరి ఫినిక్స్మాల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంలో అంటే ఆటోమేటిక్ లిక్కర్ వెండింగ్ మెషీన్ ను తాకగానే ఒక మెనూ వస్తుంది. అందులో మనకు నచ్చిన బ్రాండ్ కొనుక్కోవచ్చు. ఆన్ లైన్ లో లేదా నగదు రూపంలో డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా దీన్ని ట్రయల్ రన్ (Trail run)గా ప్రారంభించారు. ఇది సక్సెస్ అయితే మిగిలినచోట్ల కూడా వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తమిళనాడులో ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.