AP: విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇండిగో విమానయాన సంస్థ ఈ సర్వీసును నడిపేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు ప్రారంభించనున్నారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు నడవనుంది.