SRPT: మోతే మండలం మామిళ్ళగూడెం, విభలాపురం గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ, అధికారులు, గుత్తేదారు నేటికీ పనులు ప్రారంభించలేదు. ప్రతి వర్షాకాలంలో వాగు పొంగి, 10 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.